దుబాయిలో రాష్ట్ర కార్మికుని అదృశ్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయిలో రాష్ట్ర కార్మికుని అదృశ్యం

రాష్ట్రానికి చెందిన ఓ డ్రైవర్ దుబాయిలో అదృశ్యమయ్యాడు. అక్కడి అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. స్వాగత్ అనే వ్యక్తి బహ్రెయిన్లోని ఎకెర్ గ్రామంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బహ్రెయిన్లో ఆదివారం జరిగిన బాంబు పేలుడులో స్వాగత్ 40 శాతం గాయాలతో సల్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో చేరే సమయంలో ఎలాంటి గుర్తింపు పత్రాలను చూపించలేదు. దీంతో స్వాగత్‌కు తాత్కాలిక కేంద్ర జనాభా లెక్కల కార్డు నంబర్‌ను కేటాయించి వైద్యం అందించారు. ఇది జరిగిన కొంత సేపటికే స్వాగత్ ఆస్పత్రి నుంచి అదృశ్యమయ్యాడు. ఇందుకు అతను అక్రమంగా దేశంలో నివసిస్తుండడమే కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News