ఫిక్సింగ్ వల్ల క్రికెట్ కు ముప్పేమీ లేదు: గంభీర్
ఫిక్సింగ్ వల్ల క్రికెట్ కు వచ్చిన ముప్పేమీలేదని ప్రముఖ క్రికెటర్ గౌతం గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఢిల్లీలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడినంత మాత్రాన క్రికెట్ ప్రతిష్ఠకు భంగం కలగదన్నాడు. దేశంలో క్రికెట్ ను ఆడేందుకు, చూసేందుకు మిలియన్ల మంది సిద్దంగా ఉన్నారని, అటువంటి పరిస్థితుల్లో క్రికెట్ కు వచ్చే నష్టమేమీ లేదని గంభీర్ అన్నారు. దేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు యువత ఎదురుచూస్తున్నారని క్రికెట్ ను స్పాట్ ఫిక్సింగ్ ఏమీ చేయలేదని తెలిపారు.