తీహార్ నుంచి శ్రీశాంత్ కు విముక్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తీహార్ నుంచి శ్రీశాంత్ కు విముక్తి

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టైన క్రికెటర్ శ్రీశాంత్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ కేసులో అరెస్టు చేసిన 19 మందికి నిన్న బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, అంకిత్ చవాన్ తోపాటు మరో 17 మందికి కూడా బెయిలు మంజూరు చేసింది. వారు కూడా విడుదలయ్యారు. కాగా, అజిత్ చండీలా బెయిలుకు దరఖాస్తు చేసుకోనందున అతను ఇంకా తీహార్ జైలు లోనే ఉన్నాడు. తన సహచరులకు బెయిలు రావడంతో చండీలా కూడా బెయిలు దరఖాస్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడు.

More Telugu News