విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్.. నేడు మన్యం జిల్లాలో పర్యటన
- మంత్రి లోకేశ్ స్వాగతం పలికిన ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి అనిత
- పార్వతీపురంలో జరిగే షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025 కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
- పది, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించనున్న లోకేశ్
- అనంతరం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో ఉత్తమ కార్యకర్తలతో భేటీ
ఉదయం 11 గం.లకు పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ లో జరిగే షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025 కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. పది, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరిస్తారు. అనంతరం పార్వతీపురం మండలం చినబొండపల్లిలో ఉత్తమ కార్యకర్తలతో మంత్రి లోకేశ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొననున్నారు.