చెరువు కబ్జాపై హైడ్రా ఉక్కుపాదం.. మూడు భవనాలు నేలమట్టం
- అల్వాల్ చినరాయుని చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన మూడు భవనాలను పడగొట్టిన హైడ్రా సిబ్బంది
- స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు
- నిర్మాణదారులు, అధికారుల మధ్య స్వల్ప వాగ్వాదం
చినరాయుని చెరువుకు చెందిన ఎఫ్‌టీఎల్ పరిధిలో కొందరు వ్యక్తులు అక్రమంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అక్రమ నిర్మాణాలను గుర్తించారు.
ఈ క్రమంలో, గురువారం ఉదయం హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు నడుమ చినరాయుని చెరువు వద్దకు చేరుకుని, అక్రమంగా నిర్మిస్తున్న మూడు నిర్మాణాలను యంత్రాల సహాయంతో నేలమట్టం చేశారు. ఈ చర్యను నిర్మాణదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు.