రాణిస్తున్న జడేజా ... విండీస్ 179/8
ఛాంపియన్స్ ట్రోఫీ విండీస్, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రవీంద్ర జడేజా ఉత్తమ ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 44 ఓవర్లకు 179 పరుగులు మాత్రమే విండీస్ కు సమర్పించి కట్టడి చేసింది. దీంతో భువనేశ్వర్ కుమార్ తో పాటు నిప్పులు చెరిగిన ఇషాంత్ శర్మల పేస్ బౌలింగ్ కు తోడు స్పిన్నర్ రవీంద్ర జడేజా సత్తా చాటడంతో తక్కువ స్కోరుకే విండీస్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. ఇప్పటివరకూ ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా నాలుగు వికెట్లు తీసుకుని కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో విండీస్ 44 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది.