సూచీలకు కొనుగోళ్ల బలం... లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

  • 320 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 81 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.50 వద్ద ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, కీలక రంగాల షేర్లలో జరిగిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 320 పాయింట్ల లాభంతో 81,633 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 24,833 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.50 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. మరోవైపు, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 65.84 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3,282 డాలర్ల వద్ద కొనసాగుతోంది.


More Telugu News