కొడుకుతో కలిసి కాజల్ సమ్మర్ ట్రిప్.. వీడియో ఇదిగో!
--
వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ తో కాజల్ మెరిసిపోయింది. పక్కనే బ్లాక్ టీషర్ట్, ఎరుపు రంగు ట్రౌజర్ తో కాజల్ కొడుకు ముద్దుగా కనిపించాడు. ఇద్దరూ కలిసి విమానాశ్రయం లోపలికి వెళుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అభిమానులు స్పందిస్తూ.. కాజల్ అగర్వాల్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కొడుకు పుట్టినా కాజల్ అగర్వాల్ అందం ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు.