కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్... ఉగ్రవాదంపై పోరుకు ప్రతీక అన్న సెలీనా జైట్లీ
- కేన్స్ 2025లో పాపిట సిందూరంతో ఐశ్వర్య రాయ్ ప్రత్యేక ఆకర్షణ
- ఐశ్వర్య లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన
- సిందూరం ఉగ్రవాదం, అసహనానికి వ్యతిరేకంగా బలమైన ప్రకటన అని వ్యాఖ్య
- ఇది భారతీయ ఆత్మకు, ప్రేమకు, త్యాగానికి నిదర్శనమన్న సెలీనా
- సిందూరం ధరించడం శాంతియుతంగా జీవించే హక్కును కోరడమేనని వెల్లడి
- సంప్రదాయంతో పాటు, దాన్ని కాపాడుకునే ప్రమాణంగా సిందూరాన్ని చూస్తామన్న సెలీనా
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 వేడుకల్లో భారతీయ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ప్రత్యేకమైన ఆహార్యంతో అందరి దృష్టిని ఆకర్షించారు. మే 21న జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాపిటలో సిందూరం ధరించి కనిపించడం విశేషం. సంప్రదాయ భారతీయ ఆభరణాలతో, తెల్లటి చీరలో మెరిసిన ఐశ్వర్య, సిందూరంతో తన లుక్‌ను పూర్తిచేశారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అయ్యాయి.
ఐశ్వర్య రాయ్ సిందూరంతో కనిపించడంపై ప్రముఖ నటి సెలీనా జైట్లీ స్పందించారు. సిందూరం ధరించడం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కేవలం సంప్రదాయానికే పరిమితం కాకుండా, ఉగ్రవాదం, అసహనం వంటి వాటికి వ్యతిరేకంగా సిందూరం ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందని సెలీనా అభిప్రాయపడ్డారు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సెలీనా జైట్లీ ఈ విషయంపై స్పందిస్తూ, "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సిందూరం ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం వైవాహిక బంధానికి చిహ్నం మాత్రమే కాదు. భారతదేశపు సామూహిక స్ఫూర్తికి, ప్రేమకు, త్యాగానికి, ప్రతిఘటనకు ఇది ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తోంది. దీని అందం గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నప్పుడు, మనకు దీని అసలు అర్థం గుర్తుండాలి. ఇది పవిత్రమైనది, శక్తివంతమైనది, ఇప్పుడు ఇదొక స్టేట్ మెంట్ కూడా" అని రాసుకొచ్చారు.
"సిందూరం అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడటానికి, జవాబుదారీతనం డిమాండ్ చేయడానికి, శాంతియుతంగా జీవించే మన హక్కును కాపాడుకోవడానికి ఇది ఒక పిలుపు" అని సెలీనా పేర్కొన్నారు. మనం ప్రేమించే వారిని, కోల్పోయిన వారిని, తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారిని సిందూరం ద్వారా గౌరవిస్తామని ఆమె తెలిపారు. "దీన్ని కేవలం సంప్రదాయంగానే కాకుండా, అది సూచించే ప్రతీదాన్ని కాపాడుకుంటామని చేసే ప్రమాణంగా ధరిస్తాం" అని సెలీనా వివరించారు.
కాగా, ఐశ్వర్య రాయ్ తన దంతపు రంగు చీరను, సాంప్రదాయ ఆభరణాలను సిందూరంతో జతచేసి కేన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.