బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం!
- ఈ ఏడాది ఆసియా కప్ ఆడకూడదని బీసీసీఐ నిర్ణయం
- ఈ మేరకు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు
- ఇప్పటికే ఏసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్న సదరు కథనాలు
కాగా, 2023లో జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌లోనే హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. 7 ఓవర్లు వేసిన సిరాజ్ 21 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.