'క‌న్న‌ప్ప' నుంచి కౌంట్‌డౌన్ పోస్ట‌ర్.. శివుడిగా ఆక‌ట్టుకుంటున్న అక్ష‌య్ కుమార్‌

  • జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానున్న ‘కన్నప్ప’  
  • ఇప్పటికే జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు
  • ఇంకా 40 రోజులు మిగిలి ఉన్నాయంటూ కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్  
  • ఎక్స్ వేదిక‌గా పోస్ట‌ర్‌ను షేర్ చేసిన మంచు విష్ణు
టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వ‌హిస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా పోస్ట‌ర్లు, టీజర్‌లు, పాటలు ‘కన్నప్ప’ పై భారీ అంచ‌నాలు పెంచేశాయి. 

ఈ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ మూవీ నుంచి కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో శివుడి పాత్ర‌ధారి అక్ష‌య్ కుమార్ మెస్మ‌రైజింగ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. "జూన్ 27న ‘కన్నప్ప’ వ‌స్తోంది. ఇంకా 40 రోజులు మిగిలి ఉన్నాయి" అనే క్యాప్ష‌న్‌తో మంచు విష్ణు ఈ పోస్ట‌ర్‌ను 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా షేర్ చేశారు. 

ఇక‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్ర‌లో కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు.


More Telugu News