గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన ప్ర‌ధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు

  • ప్ర‌మాద ఘ‌ట‌న తీవ్రంగా క‌లిచివేసింద‌న్న ప్ర‌ధాని మోదీ
  • మృతుల కుటుంబాల‌కు రూ. 2ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌
  • అలాగే గాయ‌ప‌డిన వారికి రూ. 50వేల ప‌రిహారం ఇస్తామ‌ని వెల్ల‌డి
  • ఈ దుర్ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు సంతాపం
ఆదివారం ఉద‌యం చార్మినార్ ప‌రిధిలోని గుల్జార్‌హౌస్‌లో సంభ‌వించిన అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో ప‌లువురి క‌లిచివేసింద‌ని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేసిన ప్ర‌ధాని... క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. 

మృతుల కుటుంబాల‌కు రూ. 2ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. అలాగే గాయ‌ప‌డిన వారికి రూ. 50వేల ప‌రిహారం ఇస్తామ‌ని తెలిపారు.  

కాగా, గుల్జార్‌హౌస్‌లో చోటుచేసుకున్న అగ్నిప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ఇవాళ ఉద‌యం భవనం మొదటి అంతస్తులో ఒక్క‌సారిగా భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో భారీగా ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. మంట‌ల్లో చిక్కుకున్న కొంద‌రిని అగ్నిమాప‌క సిబ్బంది కాపాడి య‌శోద (మ‌ల‌క్‌పేట), ఉస్మానియా, డీఆర్‌డీఓ అపోలో ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. 

సీఎం చంద్ర‌బాబు సంతాపం
గుల్జార్‌హౌస్ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై సంతాపం తెలిపిన ముఖ్య‌మంత్రి... మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలియ‌జేశారు. క్ష‌త‌గ్రాతులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.    


More Telugu News