ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లో ఎద్దు వీరంగం.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

    
ఫ్యామిలీ ఫంక్ష‌న్‌లో ఎద్దు వీరంగం సృష్టించిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  పాట‌లు, డ్యాన్స్‌ల‌తో వేడుక అట్ట‌హాసంగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఇలా ఎద్దు హ‌ల్‌చ‌ల్ చేసింది. స్టేజీపై సింగ‌ర్లు పాటలు పాడుతుంటే... కింద ఉన్న వారంతా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత‌లో వారి మ‌ధ్య‌లో ఓ ఎద్దు ప్ర‌త్య‌క్ష‌మైంది. దాన్ని ఇద్ద‌రు యువ‌కులు తాళ్ల‌తో బంధించి ప‌ట్టుకుని ఉన్నారు.

ఇక పాట‌ల జోష్‌కు జోరుగా డ్యాన్స్‌లు చేస్తున్న వేళ‌.. ఆ ఎద్దు ఒక్క‌సారిగా విజృంభించింది. అక్క‌డున్న వారిని తొక్కుకుంటూ వేదిక‌పైకి దూసుకెళ్లింది. అటు నుంచి మ‌ళ్లీ స్టేజీ కింద‌కు గెంతులేస్తూ ప‌రుగెత్తింది. దీంతో అక్క‌డున్న మ‌హిళ‌లు, చిన్నారులు భ‌యంతో ప‌రుగులు పెట్టారు. చివ‌ర‌కు ఆ ఎద్దును ఎలాగోలా అక్క‌డున్న యువ‌కులు బంధించారు. కాగా, ఎద్దు దాడిలో ప‌లువురు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే, ఈ ఘ‌ట‌న ఎక్క‌డ‌, ఎప్పుడు జ‌రిగింద‌నేది తెలియ‌రాలేదు. 


More Telugu News