పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం... జగన్ దిగ్భ్రాంతి
- ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి
- మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు
- ఈ దుర్ఘటన బాధాకరమన్న జగన్
ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.