Pakistan: పీఓకేలో భారీ పేలుళ్లు, పాకిస్థాన్‌లోని పలు నగరాల్లోనూ డ్రోన్లు, పేలుళ్లు?

Massive Explosions in POK Drone Attacks in Pakistan
షార్ట్స్‌లో చూడండి
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని, సైనిక చర్యలను నిలిపివేయాలన్న అవగాహనను పాకిస్థాన్ ఉల్లంఘించి డ్రోన్లను పంపడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు ప్రతిగా భారత బలగాలు దీటుగా బదులిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సహా పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

అంతేకాకుండా, పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయం వద్ద కూడా డ్రోన్లు కనిపించాయని, వాటిపై కాల్పులు జరుపుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విమానాశ్రయ సమీపంలో పేలుళ్ల శబ్దాలు కూడా వినిపించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

భద్రత కట్టుదిట్టం

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. పంజాబ్‌లోని ఫాజిల్కా, గుజరాత్‌లోని కఛ్, జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురాతో పాటు మరికొన్ని సరిహద్దు పట్టణాల్లో బ్లాకౌట్ విధించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రజలను అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.

శనివారం సాయంత్రమే కాల్పుల విరమణకు భారత్, పాకిస్థాన్ అంగీకారం కుదిరింది. ద్వైపాక్షిక అవగాహనను పాకిస్థాన్ కొన్ని గంటల్లోనే ఉల్లంఘించిందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
Pakistan
India-Pakistan border tensions
POK explosions
Drone attacks
Peshawar airport
Cross border firing
India Pakistan conflict

More Telugu News