మాజీమంత్రి విడదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్టు

   
ఇప్ప‌టికే వ‌రుస కేసులను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ కీల‌క నేత విడదల రజనికి తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. ఆమె ప్ర‌ధాన అనుచ‌రుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు ఆపి, శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారులో ఉన్న‌ శ్రీ‌కాంత్‌ను తీసుకెళ్ల‌డానికి పోలీసులు య‌త్నించారు. దీంతో పోలీసుల‌కు విడ‌ద‌ల ర‌జనికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  

అస‌లు ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాల‌ని ఆమె పోలీసుల‌ను కోరారు. దాంతో మీ పైన కూడా కేసు పెడతానంటూ పోలీసు అధికారి ఆమెను హెచ్చరించిన వీడియో వైర‌ల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

ఇక‌, ఇప్ప‌టికే విడ‌ద‌ల ర‌జనిపై ఏసీబీ కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలో స్టోన్ క్ర‌ష‌ర్ యాజ‌మాన్యాన్ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని ఆమెపై  అభియోగాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే విడ‌ద‌ల ర‌జనిపై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఇదే కేసులో ఆమె మ‌రిది గోపీని గ‌త నెల‌లో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.


More Telugu News