తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు

  
తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చ‌ల్ల‌టి క‌బురు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో మూడు రోజులు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ మూడు రోజుల్లో గ‌రిష్ఠ‌ ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపింది. 

రానున్న రెండు రోజులు కూడా గంట‌కు 40 కిలోమీట‌ర్ల నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని పేర్కొంది. అలాగే ఈరోజు ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంట‌కు  30 కిలోమీట‌ర్ల నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది.     


More Telugu News