Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మావోయిస్టుల దాడిలో గాయపడ్డ వీసీ శుక్లా కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా (83) మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన చత్తీస్ గఢ్ లో జరిగిన మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటినుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం శుక్లా పరిస్థితి అత్యంత విషమంగా మారింది. కాగా, శుక్లా మరణంతో మావోయిస్టుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. శుక్లా.. ఇందిర హయాంలో హోం మంత్రిగా పనిచేశారు.

More Telugu News