ఆపరేషన్ సిందూర్... జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి, బావ సహా 10 మంది కుటుంబ సభ్యుల మృతి

Operation Sindhu 10 of Masood Azhars Family Members Killed
పాకిస్థాన్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున దాడులు చేపట్టాయి. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ చర్యల్లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

తెల్లవారుజామున 1.05 గంటల సమయంలో, పాకిస్థాన్ మరియు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చెందిన 10 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసూద్ సోదరి, బావ, మేనల్లుడు సహా 10 మరణించారు.

ఈ దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులతో పాటు నలుగురు సహాయకులు కూడా మరణించారని మసూద్ అజార్ స్వయంగా పేర్కొన్నట్లు బీబీసీ ఉర్దూ కథనాలు ప్రచురించాయి. ఈ వార్త ఉగ్రవాద వర్గాల్లో తీవ్ర కలకలం రేపినట్లు సమాచారం.
Go Back to Shorts
Masood Azhar
Jaish-e-Mohammed
Operation Sindhu
Pakistan
POK
Terrorist attack
Family members killed
India
Surgical strike
Bahawalpur

More Telugu News