ఓ కుర్రాడు పదో తరగతి పాసైతే ఊరుఊరంతా సంబురపడ్డది.. కారణం ఇదే!
--
ఎందుకంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజాంపూర్ గ్రామంలో పదో తరగతి పాసైన్ వారే లేరట. దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఇప్పుడు రామ్ కేవల్ పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్తులంతా సంతోషిస్తున్నారు. రామ్ కేవల్ ను, అతడి తల్లిదండ్రులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిజాంపూర్ లో సుమారు 300 మంది నివసిస్తున్నారు. ఇందులో అధిక శాతం నిరుపేద దళితులే.. పేదరికం కారణంగా చదువుకు దూరమయ్యే వారే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో రామ్ కేవల్ పగటిపూట కూలి పనులకు వెళుతూ రాత్రిపూట కష్టపడి చదివి పదో తరగతి పాసవడంతో అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు.