సంగారెడ్డిలో దారుణం.. ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య
- సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో దారుణం
- భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని మనస్తాపంతో దారుణం
- ఇద్దరు పిల్లలకు ఇంట్లో ఉరివేసిన తండ్రి
వారి పేర్లు మారిన్ (13), ఆరాధ్య (10). సుభాష్ మొదట తన ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉరివేసి చంపి, అనంతరం తానూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సుభాష్ భార్య కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, భార్య దూరమవడంతో మనస్తాపానికి గురైన సుభాష్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.