'హిట్-3' వసూళ్ల సునామీ.. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ
- నాని, శైలేశ్ కొలను కాంబోలో ‘హిట్-3’
- మే 1న విడుదలైన మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
- 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 101కోట్ల (గ్రాస్)కు పైగా కలెక్షన్స్
- ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన మేకర్స్
ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "సర్కార్ సెంచరీ. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో రూ.101 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది" అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఈ మూవీలో నాని సరసన హీరోయిన్‌గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటించారు. మిక్కీ జే మేయర్ బాణీలు అందించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.