డీఎంకే ఎంపీ ఎ. రాజాకు త్రుటిలో తప్పిన ప్రమాదం.. వీడియో ఇదిగో!
- తమిళనాడు మైలాదుతురై సభలో ప్రసంగిస్తుండగా ఘటన
- వేదికపై కుప్పకూలిన భారీ లైట్
- బలమైన గాలుల వల్ల కూలిన లైట్
తమిళనాడులో నిర్వహించిన డీఎంకే పార్టీ సభలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై అమర్చిన భారీ లైట్ ఒక్కసారిగా కూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
మే 4వ తేదీన మైలాదుతురైలో డీఎంకే పార్టీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు, అలాగే గవర్నర్ విషయంలో పార్టీ సాధించిన న్యాయ విజయం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా వేదికపై నుంచి ప్రసంగిస్తుండగా, స్టీల్ రాడ్‌కు అమర్చిన బరువైన లైట్, ఆయన మాట్లాడుతున్న మైక్రోఫోన్‌పై ఒక్కసారిగా పడింది.
ఆ సమయంలో వీచిన బలమైన గాలుల కారణంగానే లైట్ స్టాండ్ కదిలి, ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. లైట్ నేరుగా మైక్‌పై పడటంతో రాజాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ అనూహ్య పరిణామంతో సభలో ఉన్నవారు, వేదికపై ఉన్న నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. రాజా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కార్యక్రమం యథావిధిగా కొనసాగింది.