HIT 3: 'హిట్3'కు భారీ వసూళ్లు.. రెండు రోజుల్లోనే రూ. 62 కోట్లు.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

- నాని, శైలేశ్ కొలను కాంబోలో ‘హిట్3’
- ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ
- మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లు
- రెండో రోజు రూ. 19 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటన
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘హిట్-3’ (హిట్ : ది థర్డ్ కేస్). హిట్ సిరీస్ లో మూడో సినిమా అయిన దీనికి శైలేశ్ కొలను దర్శకుడు. ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. శుక్రవారం డీసెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో ప్రదర్శితమైన ఈ చిత్రం రెండో రోజే సునాయాసంగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటేసింది.
నిన్న ఒక్కరోజే ఈ సినిమా రూ. 19 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండు రోజుల్లోనే ‘హిట్ 3’ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 62 కోట్ల (గ్రాస్)కు చేరాయి. “బాక్సాఫీస్ వద్ద అర్జున్ సర్కార్ వేట కొనసాగుతోంది” అంటూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
బుక్ మై షోలో కూడా విశేష స్పందన
మరోవైపు టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో కూడా ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభిస్తోంది. మొదటి రోజు 2.70 లక్షల టికెట్లు అమ్ముడు పోగా, రెండో రోజు 2.06 లక్షల టికెట్లు విక్రయించినట్లు బుక్ మై షో తెలిపింది. ఈ వీకెండ్‌లో టికెట్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు రోజులు వీకెండ్ రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక, ఈ సినిమాలో నాని సరసన కథానాయికగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని హిట్3ను భారీగా నిర్మించారు.