సైనిక శక్తి కోసం అత్యధికంగా ఖర్చు చేసే టాప్-10 దేశాలు ఇవే!.. భారత్ ఏ స్థానంలో ఉందంటే...!
- 2024 ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికా, చైనా అగ్రస్థానం
- భారత్ 86.1 బిలియన్ డాలర్లతో 5వ అతిపెద్ద రక్షణ వ్యయ దేశం
- రష్యా, జర్మనీ, జపాన్ సైనిక ఖర్చుల్లో గణనీయ పెరుగుదల
- ఉక్రెయిన్‌పై అత్యధిక సైనిక వ్యయ భారం (జీడీపీలో 34%)
- స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) నివేదికలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై భారీగా దృష్టి సారిస్తున్నాయి. 2024 సంవత్సరానికి గాను స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో 2.44 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.8% అధికం కాగా, 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక పెరుగుదల ఇదే.
ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అమెరికా 997 బిలియన్ డాలర్ల వ్యయంతో (ప్రపంచ వాటాలో 37%) అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది ఆ దేశ జీడీపీలో 3.4 శాతానికి సమానం. 2023తో పోలిస్తే అమెరికా రక్షణ వ్యయం 5.7% పెరిగింది. చైనా 314 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో (ప్రపంచ వాటాలో 12%) రెండో స్థానంలో ఉంది. గత 30 ఏళ్లుగా చైనా సైనిక వ్యయం నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది.
ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా తన సైనిక వ్యయాన్ని గణనీయంగా పెంచింది. 149 బిలియన్ డాలర్ల (ప్రపంచ వాటాలో 5.5%) వ్యయంతో మూడో స్థానంలో నిలిచింది. ఇది రష్యా జీడీపీలో 7.1 శాతానికి సమానం. జర్మనీ 88.5 బిలియన్ డాలర్ల వ్యయంతో నాలుగో స్థానంలో ఉంది.
భారత్ 86.1 బిలియన్ డాలర్ల (ప్రపంచ వాటాలో 3.2%) రక్షణ వ్యయంతో ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచింది. ఇది 2023తో పోలిస్తే 1.6% అధికం. గత దశాబ్ద కాలంలో (2015 నుంచి) భారత్ సైనిక వ్యయం 42% పెరిగినట్లు సిప్రి నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల్లో ఒకటైన భారత్, రక్షణ రంగంలో స్వదేశీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త ఆయుధాల కొనుగోలు బడ్జెట్‌లో 75 శాతం 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకే కేటాయించడం ఇందుకు నిదర్శనమని సిప్రి పేర్కొంది.
తర్వాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్‌డమ్ (81.8 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (80.3 బిలియన్ డాలర్లు), ఉక్రెయిన్ (64.7 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (64.7 బిలియన్ డాలర్లు), జపాన్ (55.3 బిలియన్ డాలర్లు) నిలిచాయి. ఉక్రెయిన్ తన జీడీపీలో ఏకంగా 34% సైనిక వ్యయానికి కేటాయించడం గమనార్హం. జపాన్ సైనిక వ్యయంలో 21% పెరుగుదల నమోదు కావడం, 1952 తర్వాత ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల అని నివేదిక తెలిపింది. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, యుద్ధాలు, భద్రతాపరమైన ఆందోళనలే ఈ భారీ సైనిక వ్యయానికి కారణమని సిప్రి విశ్లేషించింది.