ఎన్టీఆర్ టౌన్ షిప్ ప్లాట్ల కొనుగోలుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ..
- ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ
- బేస్ ప్రైస్ 60 శాతం మొత్తంపై 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు
- మిగిలిన 40 శాతానికి కేవలం 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్‌లలో (ఎంఐజీ లేఅవుట్లు) ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై రాయితీని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్లాట్ మొత్తం విలువపై 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు మధ్య తరగతి వర్గాలకు అధిక భారంగా ఉండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులపై ఫీజు భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
నూతన విధానం ప్రకారం, బేస్ ప్రైస్ 60 శాతం మొత్తంపై 7.5 శాతం, అభివృద్ధి ఛార్జీల కింద మిగిలిన 40 శాతం మొత్తంపై 0.5 శాతం చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం వసూలు చేయనుంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ), విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ తదితర సంస్థల పరిధిలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్‌లను ప్రారంభించగా, ఇప్పటికే లాటరీ ద్వారా ప్రజలకు ప్లాట్ల కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్లాట్లు పొందిన వారికి భారీ ఊరట లభించనుంది.