Kolkata Earthquake: కోల్‌కతాలో భూకంపం.. బయటకు పరుగు తీసిన ప్రజలు

Kolkata Earthquake Tremors Felt People Rushed Out
  • రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం
  • ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలల నుంచి బయటకు పరుగు
  • ఇంట్లోని ఫ్యాన్, సోఫా కదలడం చూశామన్న నగరవాసి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈరోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, అపార్ట్ మెంట్ల నుంచి బయటకు పరుగు తీశారు. నగరంలో  భూకంపం సంభవించిందని, ఈ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.

కోల్‌కతాలో కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని సమీపంలోని బంగ్లాదేశ్‌లో గుర్తించారు. కార్యాలయాలు, అపార్ట్ మెంట్లు, రహదారుల్లోని సీసీ కెమెరాల్లో భూకంపానికి సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి.

ఇంట్లో సోఫాలో కూర్చున్నామని, ఆ సమయంలో హఠాత్తుగా ప్రకంపనలు వచ్చాయని, భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగు తీశామని స్వగత అనే స్థానికురాలు తెలిపారు. తమ ఇంట్లోని సోఫా, ఫ్యాన్ కదలడం తాము చూశామని తెలిపారు. టేబుల్ మీద ఉంచిన ఒక సీసా కిందపడిపోయిందని వెల్లడించారు.
Kolkata Earthquake
Kolkata
Earthquake
West Bengal
Bangladesh
Seismic Activity
Earthquake tremors

More Telugu News