Virosh Viral Video: పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక సందడి

Vijay Deverakonda Rashmika Mandanna Spotted at Airport After Wedding
  • వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
  • పెళ్లి మరుసటి రోజే ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షం
  • ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, స్టైలిష్ లుక్‌లో విజయ్
  • అభిమానులకు అభివాదం చేస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన కొత్త జంట
టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత తొలిసారిగా కెమెరాల కంటపడ్డారు. పెళ్లయిన మరుసటి రోజు ఈ నూతన వధూవరులు ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై సందడి చేశారు. కొత్త పెళ్లికూతురుగా రష్మిక ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు.

నిన్న‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల అనంతరం మరుసటి రోజే ఈ కొత్త జంట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన జంటను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్, రష్మిక ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. అభిమానుల కేరింతల మధ్య ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ వారిని ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ కొత్త జంటకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virosh Viral Video
Vijay Deverakonda
Rashmika Mandanna
Vijay Rashmika wedding
Udaipur airport
Tollywood couple
Telugu cinema
Celebrity wedding
Viral video

More Telugu News