రింకూను చెంప దెబ్బ కొట్టిన కుల్దీప్‌.. యువ ఆట‌గాడు సీరియ‌స్‌.. వీడియో వైర‌ల్‌!

  • నిన్న డీసీ, కేకేఆర్ మ్యాచ్‌
  • మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మైదానంలో అనూహ్య ఘ‌ట‌న‌
  • రింకూ సింగ్ చెంపపై కొట్టిన కుల్దీప్ యాద‌వ్‌
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్‌
  • కుల్దీప్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్ల డిమాండ్‌
మంగ‌ళ‌వారం రాత్రి ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ)తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) జ‌ట్టు 14 ప‌రుగుల‌ తేడాతో విజ‌యం సాధించింది. అయితే, మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మైదానంలో ఓ అనూహ్య‌ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఢిల్లీ బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్‌.. కోల్‌క‌తా బ్యాట‌ర్ రింకూ సింగ్‌పై చేయిచేసుకున్నాడు. అత‌ని చెంప‌పై కొట్టాడు. ఈ ఘ‌ట‌న‌కు తాలూకు వీడియో నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. 

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత కుల్దీప్‌, రింకూల‌తో పాటు ఇత‌ర ఆట‌గాళ్లు స‌ర‌దాగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఆ స‌మ‌యంలో ఆక‌స్మాత్తుగా రింకూ చెంపై కుల్దీప్ కొట్టాడు. న‌వ్వుతూ మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో ఏం జ‌రిగిందో రింకూకు అర్థం కాలేదు. మ‌రోసారి కూడా కుల్దీప్ చేయి చేసుకోవ‌డంతో రింకూ ఫేస్‌లో మార్పు క‌నిపించింది. యువ ఆట‌గాడు సీరియ‌స్ కావ‌డం క‌నిపించింది. 

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎంత సీనియ‌ర్ బౌల‌ర్ అయినా కుల్దీప్ అలా ప్ర‌వ‌ర్తించ‌డం మంచిది కాద‌ని, అత‌ని వ్య‌వ‌హార‌శైలిని కొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు. అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు బీసీసీఐని కోరుతున్నారు. 

ఇక‌, ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌కు బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో (20ఓవ‌ర్ల‌లో) 204 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అంగ్‌క్రిష్‌ రఘువంశీ (32 బంతుల్లో 44), రింకూ సింగ్‌ (25 బంతుల్లో 36) రాణించారు. అనంత‌రం ఛేదనకు దిగిన డీసీ 190 ర‌న్స్‌కే పరిమితమైంది. దీంతో 14 ప‌రుగుల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో డుప్లెసిస్‌(62), అక్షర్‌పటేల్‌(43) రాణించారు. 


More Telugu News