పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. కశ్మీర్‌లో ఈ 50 పర్యాటక ప్రాంతాలు, రెస్టారెంట్లు క్లోజ్.. లిస్ట్ ఇదే

  • జమ్ము కాశ్మీర్‌లో 50 పర్యాటక ప్రాంతాలు మూసివేత
  • భద్రతా కారణాలను పేర్కొన్న ప్రభుత్వం
  • ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం
  • లోయలోని అనేక జిల్లాలు, ట్రెక్కింగ్ మార్గాలపై ప్రభావం
  • పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి
జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కశ్మీర్ లోయలోని సుమారు 50 పర్యాటక ప్రదేశాలు, ట్రెక్కింగ్ మార్గాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించింది. పర్యాటకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ చర్యలు తీసుకుంది.

గత వారం పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో లోయలో భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మూసివేస్తున్న ప్రదేశాలలో అనేక ప్రసిద్ధ పర్యాటక స్థలాలు, సుందరమైన లోయలు, జలపాతాలు, వ్యూ పాయింట్లు, సాహస యాత్రికులను ఆకర్షించే ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. ఈ మూసివేతకు గురైన ప్రాంతాలలో అనేక రిసార్టులు, కేఫ్‌లు, హోటళ్లు ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.

ఈ జాబితాలో, బందిపోరా జిల్లాలోని గురేజ్ వ్యాలీ, బుద్గాం జిల్లాలోని యూస్‌మార్గ్, దూద్‌పత్రి, టౌసిమైదాన్, కుల్గాం జిల్లాలోని అహర్‌బల్, కౌసర్‌నాగ్, కుప్వారాలోని బంగుస్, కరివాన్ డైవర్, చండిగామ్, హంద్వారాలోని బంగూస్ వ్యాలీ, సోపోర్ జిల్లాలోని వులార్, రాంపోరా, చీర్హార్, ముందిజ్ హమామ్ మార్కూట్ వాటర్‌ఫాల్, ఖంపూ, అనంత్‌నాగ్‌లోని సన్ టెంపుల్ ఖెరిబాల్, వెరినాగ్ గార్డెన్, సింతన్ టాప్, మార్గాన్ టాప్, అకడ్ పార్క్ ప్రాంతాలు ఉన్నాయి.

బారాముల్లా జిల్లాలోని హబ్బా ఖటూన్ పాయింట్ కవ్‌నార్, బాబారేషి తంగ్ మార్గ్, రింగవాలి, గోగల్దారా, బండేర్‌కోట్, శ్రుంజ్ వాటర్‌ఫాల్, కమాన్ పోస్ట్ యూరి, నంబ్లాన్ వాటర్‌ఫాల్, ఎకో పార్క్ ఖండియార్, పుల్వామాలోని సంగర్వాని, గండేర్బల్‌లోని లచ్‌‌పత్రి లాటెరల్, హంగ్ పార్క్, నారానాగ్ ఉన్నాయి.

శ్రీనగర్ ప్రాంతంలోని హోటల్స్‌తో సహా పలు ప్రాంతాలను మూసివేస్తున్నారు. జామియా మసీద్, బాదామ్‌వారి, రాజోరి కడాల్ హోటల్ కనాజ్, ఆలి కడాల్ జేజే ఫుడ్ రెస్టారెంట్, ఐవోరీ హోటల్ గ్రాండ్‌టాల్, పాద్షాపాల్ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్, చెర్రీ ట్రీ రిసార్ట్, నార్త్ క్లిఫ్ కేఫ్ అండ్ రీట్రీట్, ఫారెస్ట్ హిల్ కాటేజీ, ఎకో విలేజ్ రిసార్ట్, అష్టమార్గ్ వ్యూపాయింట్, అష్టమార్గ్ స్పాట్, మమ్నెత్ అండ్ మహదేవ్ హిల్స్, బుద్ధిస్ట్ మాంటెస్సరీ, డచిగామ్, అష్టన్పోరా మూసివేత జాబితాలో ఉన్నాయి.


More Telugu News