వేదిక‌పైనే ప్రియురాలికి ప్ర‌పోజ్ చేసిన ద‌ర్శ‌కుడు.. వీడియో ఇదిగో!

    
త‌మిళ ద‌ర్శ‌కుడు అభిషన్ జీవంత్ వేదిక‌పైనే త‌న‌ ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. తాను డైరెక్ట్ చేసిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ అభిష‌న్ భావోద్వేగానికి గుర‌య్యారు. 

తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు ఆమె ఒప్పుకోవాల‌ని ఆయ‌న ప్రపోజ్ చేశారు. ఇక‌, అభిషన్ జీవంత్ ప్రపోజ్ చూసి అఖిల కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మార‌గా... నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 


More Telugu News