పంజాబ్-కోల్‌కతా మ్యాచ్‌లో వరుణుడిదే గెలుపు.. ఇరు జట్లకు చెరో పాయింట్
- ఈ సీజన్లో తొలిసారి వర్షం కారణంగా ఆగిన మ్యాచ్
- తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించిన పంజాబ్ కింగ్స్
- కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే ప్రారంభమైన వాన
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ బ్యాట్‌తో కదం తొక్కడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాంశ్ ఆర్య 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, ప్రభ్‌సిమ్రన్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, 7 పాయింట్లతో కోల్‌కతా ఏడో స్థానంలో ఉంది.