అమెరికా కోసమే మూడు దశాబ్దాలుగా ఈ దరిద్రపు పని చేస్తున్నామని చెప్పి... నాలుక కరుచుకున్న పాకిస్థాన్ మంత్రి
- ఉగ్రవాదులకు మద్దతునివ్వడంపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా సంచలన వ్యాఖ్యలు
- అమెరికా, పశ్చిమ దేశాలు, బ్రిటన్ కోసం ఇలాంటి పనులు చేశామని వ్యాఖ్య
- ఆ వెంటనే సరిదిద్దుకుని... పొరపాటున మాట్లాడానన్న మంత్రి
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉగ్రదాడులకు అమెరికాను లింక్ పెట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా.. అమెరికా, పశ్చిమ దేశాల కోసం తాము 'డర్టీ వర్క్' (మురికి పని) చేశామంటూ అందరూ షాక్ కు గురయ్యే సమాధానం ఇచ్చారు.. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత మూడు దశాబ్దాలుగా అమెరికా, పశ్చిమ దేశాలు, బ్రిటన్ కోసం పాకిస్థాన్ ఈ 'డర్టీ వర్క్' చేస్తూ వస్తోందని ఆసిఫ్ అన్నారు. ఇది తాము చేసిన పెద్ద 'తప్పిదం' అని, దానివల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో, అలాగే 9/11 దాడుల తర్వాత అమెరికా నేతృత్వంలోని తాలిబన్ వ్యతిరేక యుద్ధంలో పశ్చిమ దేశాలతో చేరకుండా ఉండి ఉంటే పాకిస్థాన్ చరిత్ర ఎంతో గొప్పగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
కశ్మీర్‌లోని పహల్గామ్ విహారయాత్రకు వెళ్లిన 28 మంది అమాయక పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటన నేపథ్యంలో పాక్ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిచ్చామని ఆయన చెప్పడం గమనార్హం. అయితే ఆ వెంటనే ఆయన తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఏదో పొరపాటున ఈ మాటలు వచ్చాయని చెప్పారు.