కుమురం భీం జిల్లాలో ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లాడిన వరుడు

  • కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఘటన
  • ఒకేసారి ఇద్దరిని వివాహం చేసుకున్న అడ్డెసర గ్రామ యువకుడు
  • ఇరువురు అమ్మాయిల కుటుంబాల అంగీకారంతో వివాహం
  • ఆదివాసీ సంప్రదాయంలో వైభవంగా పెళ్లి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక వింతైన వివాహం చోటు చేసుకుంది. ఒక యువకుడు ఒకే వేదికపై ఇద్దరు యువతులను ఏకకాలంలో పెళ్లాడటం చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే, జైనూర్ మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభ బాయ్, బద్రుషావ్ దంపతుల కుమారుడు ఛత్రుషవ్, అదే గ్రామంలోని పూనగూడకు చెందిన జంగుబాయిని, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన సోమ్‌దేవిని ఒకే ముహూర్తానికి, ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు.

ఈ వివాహానికి ఇద్దరు అమ్మాయిల కుటుంబ సభ్యులు సమ్మతి తెలిపారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. వరుడు ఛత్రుషవ్, ఇద్దరు వధువులు జంగుబాయి, సోమ్‌దేవితో కలిసి ఒకేసారి ఏడడుగులు నడిచాడు.


More Telugu News