పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ అధికారిక నోటీసులు అందజేసింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు ఈ నోటీసులు జారీ చేస్తారు. దీనిప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుంది. ఈమేరకు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.