ఉగ్రదాడిలో ఏపీ వాసుల మరణాలపై జగన్ దిగ్భ్రాంతి

  • జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో 28 మంది దుర్మరణం
  • ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండించిన జగన్
  • బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా నిలవాలని విన్నపం
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 28 మంది దుర్మరణం పాలయ్యారు. మతం గురించి అడిగి మరీ ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటనపై యావత్ ప్రపంచం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈ అమానుష ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

మ‌ృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ముష్కరుల దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. పర్యాటకులను అమానవీయంగా చంపేశారని అన్నారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోందని చెప్పారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.


More Telugu News