పహల్గామ్‌ ఉగ్ర‌దాడిలో నెల్లూరు జిల్లా వాసి మృతి

  • మృతుడు మ‌ధుసూద‌న్‌రావుది నెల్లూరు జిల్లా కావ‌లిగా గుర్తింపు
  • బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌.. అక్క‌డే స్థిర‌ప‌డ్డ కుటుంబం
  • పహల్గామ్‌కు విహార‌యాత్ర‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం
జ‌మ్మూకశ్మీర్‌లోన పహల్గామ్ మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ ఉగ్ర‌దాడిలో నెల్లూరు జిల్లా వాసి మృతి చెందారు. మృతుడిని కావ‌లికి చెందిన మ‌ధుసూద‌న్‌రావుగా గుర్తించారు. ఆయ‌న‌ బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు తెలిసింది. 

మ‌ధుసూద‌న్‌రావు కుటుంబం అక్క‌డే స్థిర‌ప‌డింది. ఆయ‌న‌కు భార్య కామాక్షి, కుమారుడు ద‌త్తు, కూతురు మేధ ఉన్నారు. పహల్గామ్‌కు విహార‌యాత్ర‌కు వెళ్ల‌గా నిన్న జ‌రిగిన ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విష‌యం తెలుసుకున్న ఆయ‌న కుటుంబం పహల్గామ్ బ‌య‌లుదేరి వెళ్లిందని స‌మాచారం. 

మ‌ధుసూద‌న్‌రావుకు 42 బుల్లెట్లు త‌గిలిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న మృత‌దేహాన్ని ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చెన్నై ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చి, అక్క‌డి నుంచి సొంతూరు కావలికి త‌ర‌లించ‌నున్నారు. ఇక‌, ఇదే దాడిలో విశాఖ‌ప‌ట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్ర‌మౌళి కూడా మృతి చెందారు.



More Telugu News