అమెజాన్ ప్రైమ్ లో ఇనయా సుల్తానా క్రైమ్ థ్రిల్లర్!
- క్రైమ్ కామెడీగా 'నటరత్నాలు'
- క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన సినిమా
- మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- రెంటల్ విధానంలో అందుబాటులోకి
శివనాగు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఇనయా సుల్తానాతో పాటు సుదర్శన్ .. తాగుబోతు రమేష్ .. రంగస్థలం మహేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మర్డర్ మిస్టరీకి కామెడీ టచ్ ఇస్తూ నడిచే కథ ఇది. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
బంగార్రాజుకి సినిమా హీరో కావాలని ఉంటుంది. ఆ దిశగా అతను అడుగు వేయడానికి స్నేహితుల సపోర్టు ఉంటుంది. సువర్ణ కూడా సినిమాలలో హీరోయిన్ కావాలని వస్తుంది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. జీవితాన్ని గురించి కలలు కంటున్న ఈ బృందం, ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటుంది. అందుకు కారకులు ఎవరు? అందులో నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అనేది కథ.