బీసీసీఐ సెంట్ర‌ల్‌ కాంట్రాక్టుల ప్ర‌క‌ట‌న‌.. ఆ ఇద్ద‌రికీ మ‌ళ్లీ చోటు.. పూర్తి వివరాలు ఇవిగో!

BCCI Announces Central Contracts 2024 and 2025
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024-25 ఏడాదికి గాను సెంట్ర‌ల్‌ కాంట్రాక్టులను ప్రకటించింది. 2023-24 ఏడాదిలో సెంట్ర‌ల్ కాంట్రాక్టుల జాబితాలో చోటు కోల్పోయిన‌ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ల‌కు మ‌ళ్లీ చోటు ద‌క్కింది. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్ రెడ్డితో పాటు రజత్ పాటీదార్, హర్షిత్ రాణా వంటి ప‌లువురు యువ ఆట‌గాళ్లకు తొలిసారి బీసీసీఐ కాంట్రాక్టులు లభించాయి. మొత్తంగా నాలుగు కేటగిరీ (A+, A, B, C)ల‌లో 34 మంది ప్లేయ‌ర్ల‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్టులు ద‌క్కాయి.

A+ కేటగిరీలో ఆ న‌లుగురే..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా నలుగురూ A+ కేటగిరీలో చోటు ద‌క్కించుకున్నారు. వీరికి వార్షిక వేత‌నం కింద రూ.7 కోట్లు ద‌క్క‌నున్నాయి. ఇందులో బుమ్రా మిన‌హాయిస్తే మిగ‌తా ముగ్గురు టీ20ల‌కు గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈసారి వీరికి A+ కేటగిరీ ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఈ ముగ్గురికి మ‌రోసారి A+ కేటగిరీ ద‌క్క‌డం విశేషం. 

A కేటగిరీలో ఎవ‌రంటే..
ఈ కేట‌గిరీలో ఆరుగురికి చోటు ద‌క్కింది. మ‌హ్మ‌ద్‌ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మ‌హ్మ‌ద్ షమీ, రిషభ్‌ పంత్. వీరికి ఏడాదికి రూ. 5 కోట్ల వేతనం అందుతుంది. 

B కేట‌గిరీలో వీరే..
B కేట‌గిరీలో టీమిండియా టీ20 జ‌ట్టు సార‌థి సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి వార్షిక వేతనంగా రూ. 3 కోట్ల చొప్పున‌ ద‌క్కుతాయి. 

C కేట‌గిరీలో చోటు ద‌క్కించుకుంది ఎవ‌రంటే..
యువ ఆట‌గాళ్లు ఎక్కువ మంది ఈ కేట‌గిరీలోనే ఉన్నారు. టీ20 స్పెష‌లిస్ట్ రింకూ సింగ్‌తో పాటు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేశ్‌ కుమార్, సంజూ శాంస‌న్‌, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్‌ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా. వీరికి ఏడాదికి రూ. 1కోటి చొప్పున వేతనం అందుతుంది. వీరిలో హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, రజత్ పాటీదార్, నితీశ్‌ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తిల‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు  తొలిసారిగా అందుకున్నారు.  
Go Back to Shorts
BCCI
Central Contracts
Indian Cricket
Cricket Players
Virat Kohli
Rohit Sharma
Jasprit Bumrah
Ravindra Jadeja
Shreyas Iyer
Ishan Kishan
IPL

More Telugu News