ఝార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్.. పెద్ద సంఖ్యలో మావోలు మృతి
- బొకారో జిల్లా 'లుగు' కొండల్లో భారీ ఎన్ కౌంటర్
- ఎనిమిది మంది మావోలను కాల్చి చంపిన బలగాలు
- ఘటనా స్థలి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం
ఎన్ కౌంటర్ జరిగిన ఘటనాస్థలి నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, రైఫిల్స్ వంటి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న బలగాలు వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టులందరూ లొంగిపోవాలని... లేకపోతే ప్రాణాలతో మిగిలి ఉండరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించిన సంగతి విదితమే. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.