కంట‌నీరు పెట్టుకున్న ఆవేశ్ ఖాన్ త‌ల్లి... ఓదార్చిన పూర‌న్‌... వైర‌ల్ వీడియో!

  
శ‌నివారం రాత్రి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌)తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) బౌల‌ర్ ఆవేశ్ ఖాన్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు రాజ‌స్థాన్‌కు తొమ్మిది ప‌రుగులు కావాల్సి ఉండ‌గా వాటిని అత‌డు డిఫెండ్ చేసి, రెండు ప‌రుగుల తేడాతో త‌న జ‌ట్టును గెలిపించాడు. మొత్తంగా అత‌డు త‌న 4 ఓవ‌ర్ల కోటాలో 37 ప‌రుగులిచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు తీశాడు. 

ఇక‌, మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఆవేశ్ ఖాన్ త‌న త‌ల్లికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ స‌మ‌యంలో ఆమె కంట‌త‌డి పెట్టుకుంది. కుమారుడితో ఏడుస్తూ మాట్లాడుతున్న ఆమెను చూసిన ల‌క్నో మ‌రో ప్లేయ‌ర్ నికోల‌స్ పూర‌న్‌... ఆమె ఓదార్చారు. "ఎందుకు ఏడుస్తున్నారు... ఏడ‌వ‌కండి.. ఓన్లీ న‌వ్వులే" అని అన్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను ఎల్ఎస్‌జీ త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇప్పుడీ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇక వీడియో కాల్ త‌ర్వాత త‌న వద్ద‌కు వ‌చ్చిన కుమారుడిని హ‌త్తుకుని క‌న్నీళ్లు పెట్టుకున్నారామె. 


More Telugu News