సోనియా, రాహుల్ పై ఈడీ చార్జిషీట్... ఖర్గే స్పందన ఇలా

20-04-2025 Sun 10:18 | National
Advertisement
  • ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈడీ చార్జిషీటులో సోనియా, రాహుల్ పేర్లు పెట్టారన్న ఖర్గే
  • ఎవరిపై కేసులు నమోదు చేసినా భయపడేది లేదని స్పష్టకీరణ
  • యంగ్ ఇండియన్ సంస్థ షేర్లు, ఆస్తులు లేదా లాభాలను ఎవ్వరూ తీసుకోలేదని, బదిలీ కూడా చేసుకోలేదని వెల్లడి
  • బీజేపీ అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్న ఖర్గే
Advertisement
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్‌షీట్‌లో ఈడీ నమోదు చేసిన విషయం విదితమే. దీనిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.

పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇంచార్జీల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఈడీ ఛార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్ పేర్లను పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఎవరి పేర్లు పెట్టినా తాము భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఛార్జ్‌షీట్‌లో పేర్లు నమోదు చేయడానికి రెండు, మూడు రోజుల ముందే నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సీజ్ చేశారన్నారు.

యంగ్ ఇండియన్ అనేది లాభార్జన సంస్థ కాదని ఆయన పేర్కొన్నారు. దీని షేర్లు, ఆస్తులు లేదా లాభాలను ఎవ్వరూ తీసుకోలేదని, బదిలీ కూడా చేసుకోలేదని చెప్పారు. బీజేపీ వాళ్లు అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 
Advertisement
Sonia GandhiRahul GandhiED ChargesheetNational Herald CaseMallikarjun KhargeCongress PartyBJPPolitical ConspiracyYoung IndianEnforcement Directorate

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more