చెన్నైలో న‌టుడు బాబీ సింహా కారు బీభ‌త్సం

  • ఎక్క‌డుతంగ‌ల్‌-చెన్నై విమానాశ్ర‌యం రోడ్డులో వాహ‌నాల‌పైకి దూసుకెళ్లిన కారు
  • ప‌లువురికి గాయాలు.. ఆరు వాహ‌నాలు ధ్వంసం
  • డ్రైవ‌ర్ మ‌ద్యం మ‌త్తులో కారు న‌డప‌డం వ‌ల్లే ప్ర‌మాద‌మ‌న్న‌ పోలీసులు
  • ఘ‌ట‌న స‌మ‌యంలో బాబీ సింహా కారులో లేర‌ని పోలీసుల‌ వెల్ల‌డి
త‌మిళ న‌టుడు బాబీ సింహా కారు ఈరోజు ఉద‌యం ఎక్క‌డుతంగ‌ల్‌-చెన్నై విమానాశ్ర‌యం రోడ్డులో బీభ‌త్సం సృష్టించింది. కారు ఇతర వాహ‌నాల‌పైకి దూసుకెళ్ల‌డంతో ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ ఘటనలో ఆరు వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. కారు డ్రైవ‌ర్ మ‌ద్యం మ‌త్తులో డ్రైవింగ్ చేయ‌డమే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు వెల్ల‌డించారు. 

డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా, ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో న‌టుడు బాబీ సింహా కారులో లేర‌ని పోలీసులు వెల్ల‌డించారు.  




More Telugu News