అప్పుడు సైబరాబాద్‌పై ఉగ్రదాడికి కుట్ర: ఎన్ఏఐ నివేదికలో కీలక విషయాలు
- హెడ్లీని గతంలో విచారించిన ఎన్ఐఏ
- ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా పలుమార్లు భారత్‌కు వచ్చినట్లు వెల్లడి
- ఉగ్రదాడికి సంబంధించి రాజ్‌కోట్ చమురుశుద్ధి కర్మాగారం, సైబరాబాద్ ఉన్నట్లు వెల్లడి
తాను ఎల్ఈటీతో కలిసి పనిచేసినట్లు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా పలుమార్లు భారత్ వచ్చినట్లు చెప్పాడు. లష్కరే తోయిబాలో తాను ఆయుధాలు వాడటానికి సంబంధించి మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు. భారత్‌లో జరగబోయే ఉగ్రదాడులకు సంబంధించి ఎల్ఈటీ సభ్యులు చూపించిన మ్యాప్‌లో రాజ్‌కోట్‌లోని చమురుశుద్ధి కర్మాగారం, హైదరాబాద్‌లోని సైబరాబాద్ ఉన్నట్లు పేర్కొన్నాడు.
భారత్‌కు తనను పంపాలని లష్కరే తోయిబా భావించినప్పుడు హైదరాబాద్, నాగపూర్, కోల్‌కతా, పుణే, బెంగళూరు నగరాలపై చర్చ జరిగిందని చెప్పాడు. చివరకి పర్యాటకుడిగా ముంబై పంపించి, అక్కడ రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు వెల్లడించాడు.