కంచ గచ్చిబౌలి అంశం.. మరోసారి విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత క్రిశాంక్

  • ఫేక్ వీడియోలను వైరల్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు
  • ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన క్రిశాంక్
  • ఈ రోజు మరోసారి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో క్రిశాంక్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమికి సంబంధించిన నకిలీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారనే ఆరోపణలతో గచ్చిబౌలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇదివరకే పలుమార్లు క్రిశాంక్‌ను విచారించారు. ఈ రోజు మరోసారి ప్రశ్నిస్తున్నారు.


More Telugu News