మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దిష్టి బొమ్మ దగ్ధం
- హైదరాబాద్ లో నిన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమం
- కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంజన్ కుమార్ యాదవ్
- అంజన్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ... తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు అంజన్ కుమార్ యాదవ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కార్పొరేటర్ అమృతతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.