కవిత ఘరానా రౌడీ కాబట్టే ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేశారు: మహేశ్ కుమార్ గౌడ్
- కేసీఆర్ మంచివాడు.. నేను రౌడీనంటూ కవిత వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
- ఆమె ఘరానా రౌడీ అని మహిళలందరికీ తెలుసని వ్యాఖ్య
- బీఆర్ఎస్ పార్టీలో రౌడీలకు తక్కువేమీ లేదని వ్యాఖ్య
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కవిత, బీఆర్ఎస్ నేతలు ఎన్నో సందర్భాలలో అహంకార ధోరణిని ప్రదర్శించారని అన్నారు. తాను రౌడీని అంటూ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలను చూశానని, కానీ ఆమె ఘరానా రౌడీ అనే విషయం ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసని అన్నారు. ఆమె రౌడీ కాకపోతే లిక్కర్ దందా ఎలా చేస్తుందని ప్రశ్నించారు. అయినా మీ బీఆర్ఎస్ పార్టీలో రౌడీలకు తక్కువేమీ లేదని కవితను ఉద్దేశించి అన్నారు. 60 నుంచి 70 శాతం మంది రౌడీలు ఆ పార్టీలో ఉన్నారని అన్నారు.