భారతి సిమెంట్స్‌పై టి. సుంకేసుల గ్రామస్తుల ఫిర్యాదు
- పరిశ్రమ మైనింగ్ పేలుళ్ల వల్ల తమ గృహాలు దెబ్బతింటున్నాయని వాపోయిన టి. సుంకేసుల గ్రామస్తులు
- కడప జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ కు గోడు వెళ్లబోసుకున్న గ్రామస్తులు
- గ్రామంలో శాశ్వతంగా మైనింగ్ బ్లాస్టింగ్ టెస్టింగ్ పరికరాలను అమర్చుతామని హామీ ఇచ్చిన అధికారులు ఏర్పాటు చేయలేదన్న గ్రామస్తులు
భారతి సిమెంట్ పరిశ్రమపై వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల మండలం, టి. సుంకేసుల గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. పరిశ్రమలో మైనింగ్ పేలుళ్ల కారణంగా తమ గృహాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను గ్రామస్తులు కలిసి తమ సమస్యను విన్నవించారు.
ఈ విషయంపై గతంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, గత నెల 20వ తేదీన పరిశీలించారని వారు వివరించారు. గ్రామంలో శాశ్వతంగా మైనింగ్ బ్లాస్టింగ్ టెస్టింగ్ పరికరాలను అమర్చుతామని అధికారులు చెప్పినా, ఇంత వరకూ ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుపై జేసీ స్పందిస్తూ, గతంలో అధికారులు తనిఖీ చేసిన నివేదిక తమకు అందలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.