ఇదేందయ్య ఇది.. చాట్ జీపీటీను ఇలా కూడా వాడతారా?.. వైర‌ల్ వీడియో!

      
ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం భారీగా పెరుగుతోంది. తాజాగా ఓ వ్య‌క్తి పుచ్చ‌కాయ కొనుగోలు చేసేందుకు చాట్ జీపిటీని వినియోగించి అంద‌రినీ విస్తుపోయేలా చేసిన‌ వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. చాట్ జీపీటీ సాయంతో అత‌డు మొద‌ట‌ వివిధ ర‌కాల పుచ్చ‌కాయ‌ల‌ను ప‌రిశీలించ‌డం వీడియోలో ఉంది. 

ఆ త‌ర్వాత అందులో తియ్య‌ని, ఎర్ర‌గా ఉన్న పుచ్చ‌కాయ‌ను గుర్తించాల‌ని ఏఐని కోరాడు. దాంతో కొన్ని పుచ్చ‌కాయ‌ల‌ను ప‌రిశీలించాక ఒక‌దానిని అది సూచించింది. ఏఐ సూచించిన ఆ పుచ్చ‌కాయ‌ను క‌ట్ చేసి చూడ‌గా నిజంగానే పండు ఎర్ర‌గా ఉండ‌డం వీడియోలో చూడొచ్చు. ఇది ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌న‌ప్ప‌టికీ, ఇప్పుడీ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు.   


More Telugu News