ఏపీ లిక్కర్ స్కాం... చిత్రపురి కాలనీలోని మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు

  • హైదరాబాద్‌లో రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
  • మధ్యాహ్నం నుంచి మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు
  • నిన్న రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాల్లో సోదాలు
హైదరాబాద్‌లో ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు... హైదరాబాద్‌లోని మద్యం వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ రోజు రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉన్న మేఘనా రెడ్డి నివాసంలో మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బును ఉపసంహరించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో దర్యాప్తు బృందం నిన్న సోదాలు నిర్వహించింది. నగరంలోని మూడు ప్రాంతాల్లో మొత్తం 50 మంది సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.


More Telugu News